స్వదేశంలో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హోమ్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో ఐదు టీ20లు ఆడనుంది. మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి.
నవంబర్ 27న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న తొలి మహిళల అండర్-19 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది.
భారత జట్టులో తెలంగాణ అమ్మాయి
సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష 8 ఏళ్లకే జిల్లా స్థాయిలో ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైంది.
అదే విధంగా బీసీసీఐ నిర్వహించిన డర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. అదే విధంగా జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ-2021లోను త్రిష ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
చదవండి: IND vs NZ: సూర్యకుమార్‌పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ!
Comments
Please login to add a commentAdd a comment