అన్నను మించిపోయేలా ఉన్నాడు.. తొలి మ్యాచ్‌లోనే! వీడియో వైరల్‌ | Naseem Shah Hands Debut PSL Cap To His Brother Hunain Shah | Sakshi
Sakshi News home page

PSL 2024: అన్నను మించిపోయేలా ఉన్నాడు.. తొలి మ్యాచ్‌లోనే! వీడియో వైరల్‌

Published Fri, Feb 23 2024 8:28 AM | Last Updated on Fri, Feb 23 2024 10:13 AM

Naseem Shah Hands Debut PSL Cap To His Brother Hunain Shah - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ నుంచి మరో పేస్‌ సంచలనం పుట్టుకొచ్చాడు. ఇటీవలే అండర్‌-19 అండర్‌ వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన యువ పేసర్‌ హునైన్ షా.. ఇప్పుడు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. పీఎస్‌ఎల్‌-2024లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్  తరపున  హునైన్ షా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో గురువారం  లాహోర్‌ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హునైన్ ఆకట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన హునైన్.. 13 పరుగులిచ్చి వికెట్‌ పడగొట్టాడు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్‌ ఓపెనర్‌ జాసెన్‌ రాయ్‌ను 20 ఏళ్ల హునైన్ అద్బుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పీఎస్‌ఎల్‌లో హునైన్‌కు ఇదే తొలి వికెట్‌.

కాగా హునైన్‌ షా ఎవరో కాదు.. పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ నసీం షా​కు స్వయాన సోదరుడే. అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే తన తమ్ముడు తొలి పీఎస్‌ఎల్‌ వికెట్‌ సాధించగానే నసీం సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటైడ్‌ పై 3 వికెట్ల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్‌ విజయం సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement