![SRH vs RR, IPL 2024: Nitish Reddy slams half century off 30 balls](/styles/webp/s3/article_images/2024/05/2/nitesh.gif.webp?itok=oJnggDtG)
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో నితీష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో సెటిల్ అయ్యాక బౌండరీల వర్షం కురిపించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్‌కు అయితే నితీష్ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే నితీష్ కుమార్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డితో పాటు ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(28) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు.
— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 2, 2024
Comments
Please login to add a commentAdd a comment