సెంచరీలతో చెలరేగిన రాహుల్‌, నితేష్‌ | Rahul singh and nitesh reddy keeps Hyderabad in driving seat against Mizoram | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2023-24: సెంచరీలతో చెలరేగిన రాహుల్‌, నితేష్‌

Published Sun, Feb 4 2024 7:09 AM | Last Updated on Sun, Feb 4 2024 7:09 AM

Rahul singh and nitesh reddy keeps Hyderabad in driving seat against Mizoram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌లో భాగంగా మిజోరం జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 120/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 458 పరుగులు సాధించింది.

కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (108; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితేశ్‌ రెడ్డి (115; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలు సాధించారు. ప్రజ్ఞయ్‌ రెడ్డి (91; 10 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం చేజార్చుకోగా... రోహిత్‌ రాయుడు (60; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించాడు. మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement