బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టు ఇప్పటికే పెర్త్‌కు చేరుకుని తీవ్రంగా శ్రమిస్తుండగా.. తాజాగా ఆసీస్ జట్టు కూడా తొలి టెస్టు వేదికకు చేరుకుంది.
కాగా ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు తుది జట్టులో నితీష్‌కు అవకాశమివ్వాలని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఈ విషయం ఇప్పటికే నితీష్‌కు జట్టు మేనెజ్‌మెంట్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అతడు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ తీవ్రంగా చేస్తున్నట్లు సమాచారం. మొదటి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కూడా దూరం కానున్నారు. ఈ క్రమంలోనే నితీష్ అరంగేట్రానికి మార్గం సుగమమైనట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. కాగా ఈ ఏడాది నితీష్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.
ఐపీఎల్‌లో అదరగొట్టి..
ఐపీఎల్-2024లో నితీష్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్బుత ప్రదర్శన కనబరిచి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన నితీష్ రెడ్డి 142.92 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. దీంతో అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కింది.
అక్కడ కూడా నితీష్ తనను తను నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 74 పరుగులతో ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ సత్తాచాటాడు. అదేవిధంగా బీజీటీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధాకరిక టెస్టులో కూడా నితీష్ భారత-ఎ జట్టు తరపున 47 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కూడా నితీష్ కుమార్ రెడ్డి తన మార్క్‌ను చూపించాడు. ఇప్పటివరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి.. 779 పరుగులతో పాటు 56 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: Pat Cummins: కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్
Comments
Please login to add a commentAdd a comment