భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌తో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఢిల్లీ యువ పేసర్ మయాంక్ యాదవ్ భారత తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.
మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ చేతుల మీదగా వీరిద్దరూ భారత క్యాప్‌లను అందుకున్నారు. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేయడంతో ఈ యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. కాగా గ్వాలియర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
తుది జట్లు
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment