ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(jasprith Bumrah) తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో బుమ్రా తన రేటింగ్ పాయింట్లను మెరుగు పరుచుకున్నాడు.
బుమ్రా తన కెరీర్‌లో 900కు పైగా టెస్టు రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. తద్వారా జస్ప్రీత్ ఓ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బుమ్రా సమం చేశాడు.
2016లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత అశ్విన్ 904 పాయింట్ల టెస్టు రేటింగ్ పాయింట్లను సాధించాడు. మళ్లీ ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత బుమ్రా ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా టెస్టు ర్యాకింగ్స్‌లో 900 పాయింట్లు దాటిన 26వ ఆటగాడిగా బుమ్రా నిలిచాడు.
ఇక తాజా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్‌లో బుమ్రా అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా.. వరుసగా రెండు మూడు ర్యాంకింగ్స్‌లో కగిసో రబాడ(856), జోష్ హాజిల్‌వుడ్(852) నిలిచారు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment