ICC Test ranking
-
ICC Test Rankings: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా...
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(jasprith Bumrah) తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో బుమ్రా తన రేటింగ్ పాయింట్లను మెరుగు పరుచుకున్నాడు.బుమ్రా తన కెరీర్లో 900కు పైగా టెస్టు రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. తద్వారా జస్ప్రీత్ ఓ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బుమ్రా సమం చేశాడు. 2016లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత అశ్విన్ 904 పాయింట్ల టెస్టు రేటింగ్ పాయింట్లను సాధించాడు. మళ్లీ ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత బుమ్రా ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా టెస్టు ర్యాకింగ్స్లో 900 పాయింట్లు దాటిన 26వ ఆటగాడిగా బుమ్రా నిలిచాడు.ఇక తాజా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్లో బుమ్రా అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా.. వరుసగా రెండు మూడు ర్యాంకింగ్స్‌లో కగిసో రబాడ(856), జోష్ హాజిల్‌వుడ్(852) నిలిచారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
టీమిండియాకు మరో బిగ్ షాక్..
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను స్వదేశంలో 4-0 తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టెస్టుల్లో నంబర్‌వన్‌గా అవతరించింది. గురువారం విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 119 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. 117 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన భారత్ 116 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. నాలుగో స్ధానంలో ఇంగ్లండ్ నిలిచింది. ఇక భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన ప్రోటీస్ ఐదో స్థానానికి ఎగబాకగా, పాకిస్థాన్ ఆరో స్థానానికి దిగజారింది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో భాగంగా ఆసీస్ పాకిస్తాన్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం పర్యటించనుంది. కాగా 1998 తర్వాత ఆసీస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. మరోవైపు స్వదేశంలో శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయానికి వస్తే.. టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 49.07 విజయ శాతంతో నాలుగు విజయాలు, మూడు ఓటములు, రెండు డ్రాలతో ఐదవ ర్యాంక్‌లో కోనసాగుతోంది. మరోవైపు, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లలో 86.66 విజయ శాతంతో నాలుగు విజయాలు, ఒక డ్రాతో రెండో స్థానంలో ఉంది. చదవండి: IND vs SA: ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్ -
Ravi Shastri : కుర్రాళ్లు కష్టపడ్డారు.. అందుకే ఈ ఫలితం
ముంబై: ''మన కుర్రాళ్లు సరైన సమయంలో కష్టపడ్డారని అందుకే ఈరోజు టెస్టుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామంటూ'' టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఐసీసీ గురువారం విడుదల చేసిన వార్షిక టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా 121 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రవిశాస్త్రి తన ఆనందాన్ని పంచుకున్నాడు.'టీమిండియా ధృడమైన సంకల్పం, స్థిరమైన ప్రదర్శన వల్లే సుదీర్ఘ ఫార్మాట్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగాం. ర్యాంకింగ్స్‌కు సంబంధించి నిబంధనలను ఐసీసీ మధ్యలో మార్చింది. అయినప్పటికీ.. సవాళ్లను అధిగమిస్తూ తిరిగి నంబర్ వన్ ర్యాంకును పొందాం. ఆటగాళ్లు కఠిన పరిస్థితుల్లో కఠిన క్రికెట్ ఆడారు. జట్టు విజయాల పట్ల.. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. మన కుర్రాళ్లు కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఈ ఫలితం ' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 120 రేటింగ్‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్ (109 రేటింగ్) మూడో స్థానంలో నిలిచింది. మే 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం... అంతకుముందు రెండేళ్లలో జరిగిన మ్యాచ్‌లకు 50 శాతం పాయింట్ల ఆధారంగా జట్లకు ఐసీసీ రేటింగ్స్‌ను కేటాయించింది. ఇందులో భారత్ 24 మ్యాచ్‌ల్లో 2,914 పాయింట్లు సాధించగా... రెండో స్థానంలో నిలిచిన కివీస్ 18 మ్యాచ్‌ల్లో 2,166 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. జూన్ 18 నుంచి 22 వరకు టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక 2017 నుంచి భారత జట్టుకు రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత మరోసారి అతని పదవికాలాన్ని పొడిగించారు. చదవండి: ICC Rankings: టాప్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచింది: పైన్ -
దుమ్మురేపిన అశ్విన్.. కెరీర్ బెస్ట్‌కు రోహిత్
దుబాయ్: ఐసీసీ ఆదివారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తన టెస్టు కెరీర్లో తొలిసారి టాప్ 10లో అడుగుపెట్టిన రోహిత్ 742 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండో టెస్టులో సెంచరీ చేయడం.. మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో కఠినంగా ఉన్న పిచ్‌పై అర్థ సెంచరీతో మెరిశాడు. కాగా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మాత్రం రెండు స్థానాలు దిగజారి 708 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ర్యాంకింగ్‌లో మాత్రం ఏ మార్పు లేదు. 836 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 853 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. ఇక న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. లబుషేన్ 878 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి 823 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఒకస్థానం కోల్పోయి 746 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ మూడు స్థానాలు దిగజారి 809 పాయింట్లతో 6వ స్థానంలో నిలవగా.. మరో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 800 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానం నిలుపుకోగా.. 825 పాయింట్లతో నీల్ వాగ్నర్(ఆస్ట్రేలియా) రెండో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ విభాగంలో టీమిండియా నుంచి రవీంద్ర జడేజా రెండో స్థానాన్ని కాపాడుకోగా.. అశ్విన్ 5వ స్థానంలో ఉన్నాడు. విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ 407 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచాడు. చదవండి: ‘పిచ్ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’ 'థ్యాంక్స్ పీటర్సన్.. అర్థం చేసుకున్నందుకు' -
దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్
దుబాయ్: ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్‌రౌండ్ విభాగంలో 428 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో బెన్ స్టోక్స్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో బొటనవేలి గాయంతో జడేజా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు దిగలేదు. కాగా జడేజా బొటనవేలికి శస్త్ర చికిత్స పూర్తయినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గాయం కారణంగా జడేజా ఆసీస్‌తో జరిగే నాలుగో టెస్టుతో పాటు ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది. (చదవండి: సిరాజ్‌కు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్!) పాక్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జేమిస్ 5 స్థానాలు ఎగబాకి టాప్ 5లో చోటు సంపాదించాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో కివీస్ స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. స్మిత్ 900 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కాగా టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలవగా.. భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే ఒక స్థానం దిగజారి 7వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా బౌలర్లు అశ్విన్, బుమ్రాలు 9, 10వ స్థానాల్లో నిలిచారు. (చదవండి: 'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా') -
పంత్... అమాంతం!
దుబాయ్: ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం భారత బ్యాట్స్‌మెన్‌ను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పైకి తీసుకొచ్చింది. మంగళవారం విడుదల చేసిన ఈ జాబితాలో అందరికంటే ఎక్కువగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ స్థానం మెరుగైంది. సిరీస్‌కు ముందువరకు 48వ ర్యాంక్‌లో ఉన్న పంత్... 20 క్యాచ్‌లు, 350 పరుగులు సాధించి ఇప్పుడు ఏకంగా 17వ స్థానానికి ఎగబాకాడు. తద్వారా 1973లో ఫారూఖ్ ఇంజినీర్ సాధించిన అత్యుత్తమ భారత వికెట్ కీపర్ ర్యాంక్‌ను సమం చేశాడు. ఈ విషయంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని సైతం వెనక్కు నెట్టాడు. ధోని టెస్టు ఉత్తమ ర్యాంక్ 19 కావడం విశేషం. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పుజారా ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌కు చేరాడు. కోహ్లి నంబర్‌వన్ స్థానం చెక్కుచెదరలేదు. -
ఐదో స్థానానికి దిగజారిన పాకిస్థాన్
దుబాయ్: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ ఐసీసీ ర్యాంకింగ్స్ జాబితాలో కిందకు పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్ జాబితాలో పాక్ రెండు స్థానాలు కోల్పోయి ఐదో ర్యాంకుకు దిగజారింది. పాక్‌తో టెస్టు సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో పాక్ 220 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో పాక్ 97 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది. న్యూజిలాండ్ (96), శ్రీలంక (96) కేవలం ఓ రేటింగ్ పాయింట్ వెనుకబడి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (109), దక్షిణాఫ్రికా (102), ఇంగ్లండ్ (101) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.