
దుబాయ్: ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం భారత బ్యాట్స్‌మెన్‌ను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పైకి తీసుకొచ్చింది. మంగళవారం విడుదల చేసిన ఈ జాబితాలో అందరికంటే ఎక్కువగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ స్థానం మెరుగైంది. సిరీస్‌కు ముందువరకు 48వ ర్యాంక్‌లో ఉన్న పంత్... 20 క్యాచ్‌లు, 350 పరుగులు సాధించి ఇప్పుడు ఏకంగా 17వ స్థానానికి ఎగబాకాడు.
తద్వారా 1973లో ఫారూఖ్ ఇంజినీర్ సాధించిన అత్యుత్తమ భారత వికెట్ కీపర్ ర్యాంక్‌ను సమం చేశాడు. ఈ విషయంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని సైతం వెనక్కు నెట్టాడు. ధోని టెస్టు ఉత్తమ ర్యాంక్ 19 కావడం విశేషం. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పుజారా ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌కు చేరాడు. కోహ్లి నంబర్‌వన్ స్థానం చెక్కుచెదరలేదు.
Comments
Please login to add a commentAdd a comment