India vs Aus 5th test day 2 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది.
ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్‌లో భారత్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) నాటౌట్‌గా ఉన్నారు.
అంతకుముందు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, వెబ్‌స్టర్ తలా వికెట్ సాధించారు. కాగా ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
నితీశ్ రెడ్డి(21 బంతుల్లో 4) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. జడేజా రెండు పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 129/6 (27.4). ఆసీస్ కంటే 133 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.
రిషబ్ పంత్ ఔట్..
రిషబ్ పంత్ ధనధాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసిన పంత్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 23 ఓవర్లకు భారత్ స్కోర్ 125-5. క్రీజులో జడేజా(2), నితీశ్ కుమార్ రెడ్డి(1) ఉన్నారు. భారత్ ప్రస్తుతం 129 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పంత్ 61 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 22 ఓవర్లకు భారత్ స్కోర్: 124/2. టీమిండియా ప్రస్తుతం 128 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
దూకుడుగా ఆడుతున్న పంత్..
టీమిండియా వరుస క్రమంలో వికెట్లు పడతున్నప్పటికి రిషబ్ పంత్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 97/4. భారత్ ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత్ నాలుగో వికెట్ డౌన్..
శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన గిల్..వెబ్‌స్టర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 78/4
భారత్ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి మరి కోహ్లి ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్ 68/3. క్రీజులో గిల్(13), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
బోలాండ్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను బౌల్డ్ చేసిన ఈ పేస్ బౌలర్.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(22)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 47/2 (9.5). గిల్ ఐదు పరుగులతో ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. టీమిండియా స్కోరు: 42/1 (7.3). శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 22 పరుగులతో ఉన్నాడు.
ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 36/0 (6)
జైస్వాల్ 21, కేఎల్ రాహుల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
జైశ్వాల్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్‌లో 16 పరుగులు
భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో జైశ్వాల్ ఏకంగా 16 పరుగులు రాబట్టాడు.
181 పరుగులకు ఆసీస్ ఆలౌట్..
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ తమ తొన్నింగ్స్‌లో 181 పరుగులకు కుప్పకూలింది. 9/1 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అదనంగా 172 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టర్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్‌స్టాస్(23) పరుగులతో రాణించారు.
ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్.. వెబ్‌స్టర్ ఔట్
ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన వెబ్‌స్టర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 48 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 170/9
ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్..
ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన స్టార్క్.. నితీశ్‌కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆసీస్ ఏడో వికెట్ డౌన్..
ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కమ్మిన్స్.. నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. 46 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 163/7. ప్రస్తుతం క్రీజులో వెబ్‌స్టర్(56 నాటౌట్), స్టార్క్(1) ఉన్నారు.
ఆరో వికెట్ డౌన్.. క్యారీ ఔట్
ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వచ్చాడు.
నిలకడగా ఆడుతున్న వెబ్‌స్టర్, క్యారీ..
లంచ్ బ్రేక్ అనంతరం వెబ్‌స్టర్, క్యారీ నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్లు ముగిసే 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వెబ్‌స్టర్(37), క్యారీ(5) ఉన్నారు.
లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?
రెండో రోజు లంచ్ విరామానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో వెబ్‌స్టర్(28), క్యారీ(4) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ డౌన్..
ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన స్మిత్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు.
సిరాజ్ ఆన్ ఫైర్..
మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. 12 ఓవర్ వేసిన సిరాజ్ రెండో బంతికి సామ్ కాన్‌స్టాస్‌ను ఔట్ చేయగా.. ఐదో బంతికి డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/4. క్రీజులో వెబ్‌స్టర్(0), స్మిత్(4) ఉన్నారు.
ఆసీస్ రెండో వికెట్ డౌన్..
రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన లబుషేన్.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 25/2. క్రీజులో సామ్ కాన్‌స్టాస్(18), స్మిత్(4) ఉన్నారు.
రెండో రోజు ఆట ఆరంభం..
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ ఎటాక్‌ను మహ్మద్ సిరాజ్ ప్రారంభించాడు. తొలి రోజు ఆట మగిసే సమయానికి ఆసీస్ వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment