భారత జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ ఏకపక్షంగా సాగేదని ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచించడంలో బుమ్రా బుర్ర చురుకైందని మెక్‌గ్రాత్ కితాబిచ్చాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ముగియగా... టీమిండియా 1–2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు విఫలమైనా... బుమ్రా ఒంటి చేత్తో జట్టును పోటీలో నిలిపాడని మెక్‌గ్రాత్ ప్రశంసించాడు. ‘బుమ్రా లేకుండా సిరీస్ మరింత ఏకపక్షం అయ్యేది. అతడు టీమిండియాకు ప్రధాన బలం. అతడి బౌలింగ్‌కు నేను పెద్ద అభిమానిని. భారత జట్టు అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి.
భారత్‌లో క్రికెట్‌కు చాలా క్రేజ్ ఉంది. గత 12 ఏళ్లుగా ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ తరఫున భారత్‌లో పనిచేస్తున్నా. మా సంస్థ ద్వారా ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లు ఎందరో లబ్ధి పొందారు. క్రికెట్‌లోని అన్నీ ఫార్మాట్లలో టెస్టులే అత్యుత్తమం. మెల్‌బోర్న్ టెస్టును ఐదు రోజుల్లో కలిపి 3,70,000 మంది వీక్షించడం ఆనందాన్నిచి్చంది. ఇది టెస్టు క్రికెట్‌కున్న ఆదరణను వెల్లడిస్తుంది’ అని మెక్‌గ్రాత్ అన్నాడు.
చదవండి: బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్ చేయాలని చట్టం తెస్తాం
Comments
Please login to add a commentAdd a comment