మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో 184పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి వరకు డ్రా కోసం భారత్ ప్రయత్నించినప్పటకి, ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
జైశ్వాల్ పోరాటం వృథా..
లక్ష్య చేధనలో ఆరంభంలోనే భారత్‌కు ఆసీస్ బౌలర్లు బిగ్ షాకిచ్చారు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా పడింది. ఈ సమయంలో యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో నిలబడ్డారు. తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. రెండో సెషన్‌లో మాత్రం జైశ్వాల్, పంత్ విరోచిత పోరాటం వల్ల ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు.
కానీ మూడో సెషన్‌లో మాత్రం ఆసీస్ బౌలర్లు తిరిగి పంజా విసిరారు. అప్పటివరకు కుదురుగా ఆడిన పంత్.. ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. జడేజా, నితీశ్ రెడ్డి వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి జైశ్వాల్ తన విరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు ప్రయత్నించాడు. కానీ వివాదస్పద రీతిలో జైశ్వాల్ ఔట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో భారత్ ఓటమి లాంఛనమైంది. భారత బ్యాటర్లలో జైశ్వాల్ (208 బంతుల్లో 84) జైశ్వాల్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిషబ్ పంత్ పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్, కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హెడ్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 340 పరుగుల టార్గెట్‌ను కంగారులు ఉంచారు. ఆ లక్ష్యాన్ని చేధించడంలో భారత్ చతికలపడింది. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా వేదికగా ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment