IND vs Aus 5th Test Day 3 Live updates and Highlights: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది.
ఇక మ్యాచ్‌లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.
ఓటమి దిశగా భారత్..
సిడ్నీ టెస్టులో టీమిండియా ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 162 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 15 పరుగులు కావాలి.
ఆసీస్ నాలుగో వికెట్ డౌన్.. ఖావాజా ఔట్
ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.
15 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 81/3
ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(26 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(8 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.
లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?
లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(19 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(5 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.
ఆసీస్ మూడో వికెట్ డౌన్..
ప్రస్దిద్ద్ కృష్ణ భారత్‌కు మరో వికెట్ అందించాడు. 4 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 65/3.
లబుషేన్ ఔట్..
ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 52/2.
ఆసీస్ తొలి వికెట్ డౌన్
సామ్ కాన్‌స్టాస్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కాన్‌స్టాస్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(5), మార్నస్ లబుషేన్ ఉన్నారు.
భారత్‌కు భారీ షాక్..
కాగా మూడో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా బ్యాటింగ్ అనంతరం బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు.
భారత్ ఆలౌట్..
టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. 141 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
దీంతో ఆస్ట్రేలియా ముందు 161 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఉంచగల్గింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టగా... కమ్మిన్స్ మూడు వికెట్లు తీశాడు. ఇక భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సుందర్ క్లీన్ బౌల్డ్..
భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
భారత్ ఏడో వికెట్ డౌన్.. జడేజా ఔట్
రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన జడేజా.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 148/7
మూడో రోజు ఆట ఆరంభం..
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది.ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మూడో రోజు ఆటలో పింక్ జెర్సీతో భారత్ బరిలోకి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment