IND vs AUS 4th Test Day 5 Live Updates: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ గెలుపుతో ఆసీస్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ ఆశలను సజీవం చేసుకోగా.. టీమిండియా రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే!
కాగా మెల్‌బోర్న్‌లో 340 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ (84)ఒంటరి పోరాటం చేయగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు. రోహిత్ శర్మ(9), కేఎల్ రాహుల్(0), విరాట్ కోహ్లి(5) దారుణంగా విఫలం కాగా.. రిషభ్ పంత్ 30 పరుగులు చేశాడు.
మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జడేజా 2, నితీశ్ రెడ్డి 1, ఆకాశ్ దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 పరుగులు చేశారు. 45 బంతులు ఎదుర్కొన్న వాషింగ్టన్ సుందర్ 5 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. నాథన్ లియాన్ రెండు, ట్రవిస్ హెడ్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
155 పరుగులకు టీమిండియా ఆలౌట్
నాథన్ లియాన్ బౌలింగ్‌లో సిరాజ్(0) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 155 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ కాగా.. ఆసీస్ 184 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన బుమ్రా(0).
ఎనిమిదో వికెట్ డౌన్..
ఆకాష్ దీప్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఆకాష్.. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మ్యాచ్ డ్రాగా ముగియాలంటే భారత్ ఇంకా 14 ఓవర్లు ఆడాల్సి ఉంది. ఆసీస్ విజయానికి ఇంకా 2 వికెట్లు కావాలి.
జైశ్వాల్ ఔట్..
యశస్వి జైశ్వాల్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 84 పరుగులు చేసిన జైశ్వాల్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ ఔటైన విధానం వివాదస్పదమైంది. స్నికో మీటర్‌లో బంతికి బ్యాట్ తాకనట్లు తేలినప్పటికి థర్డ్ అంపైర్‌గా మాత్రం ఔట్‌గా ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియాలంటే భారత్ ఇంకా 20 ఓవర్లు ఆడాల్సి ఉంది.
టీమిండియాకు షాక్.. ఆరో వికెట్ డౌన్
నితీశ్ రెడ్డి(1) రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ వెనుదిరిగాడు. జట్టు స్కోరు: 130/6 (63.2)
టీమిండియాకు భారీ షాక్!
లక్ష్య ఛేదనలో టీమిండియాకు మరో షాక్ తగిలింది. 127 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో జడేజా ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. నితీశ్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 74 పరుగులతో ఆడుతున్నాడు. భారత్ స్కోరు: 127/5 (62.4)
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
ట్రవిస్ హెడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ అవుయ్యాడు. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ స్కోరు: 121/4(59). జడేజా క్రీజులోకి రాగా.. జైస్వాల్ 70 పరుగులతో ఉన్నాడు.
యశస్వి, పంత్ విరోచిత పోరాటం..
రెండో సెషన్‌లో టీమిండియా అద్బుతంగా ఆడింది. భారత బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ విరోచిత పోరాటం కనబరుస్తున్నారు. వీరిద్దరూ 79 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
టీ బ్రేక్ సమయానికి 54 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(63 నాటౌట్), పంత్(28 నాటౌట్) ఉన్నారు. టీమిండియా విజయానికి 228 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్‌కు 7 వికెట్లు కావాలి.
యశస్వి జైశ్వాల్ హాఫ్ సెంచరీ..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 40 ఓవర్లకు భారత్ స్కోర్: 86/3
దూకుడుగా ఆడుతున్న జైశ్వాల్..
లంచ్ విరామం తర్వాత మళ్లీ ఆట ప్రారంభమైంది. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(27), పంత్(4) ఉన్నారు.
కష్టాల్లో భారత్..
విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఖావాజా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 33 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామానికి భారత్ స్కోర్: 33/3
కమ్మిన్స్ ఫైర్..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు భారత్ భారీ షాకిచ్చాడు. 17 ఓవర్‌లో తొలి బంతికి రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపిన కమ్మిన్స్.. ఆఖరి బంతికి రాహుల్(0)ను ఔట్ చేశాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 25/2
రోహిత్ శర్మ ఔట్..
340 పరుగుల లక్ష్యచేధనలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు.
234 పరుగులకు ఆసీస్ ఆలౌట్..
మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. 228/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా అదనంగా 6 పరుగులు చేసి 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 340 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్ ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment