ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కాన్‌స్టాస్ తన అంతర్జాతీయ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుతో డెబ్యూ చేసిన కొన్‌స్టాస్.. తన అద్బుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. డేవిడ్ వార్నర్‌కు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగిన కొన్‌స్టాస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. తొలుత ఆచితూచి ఆడిన కొన్‌స్టాస్ 6 ఓవర్ల తర్వాత తన బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. వరల్డ్‌క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం కొన్‌స్టాస్ టార్గెట్ చేశాడు. 19 ఏళ్ల కొన్‌స్టాస్ బుమ్రా బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ల బాది ఆశ్చర్యపరిచాడు.
ఈ క్రమంలో కేవలం 52 బంతుల్లోనే కొంటాస్ తన తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 65 బంతులు ఎదుర్కొన్న కాన్‌స్టాస్ 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక తన అరంగేట్ర టెస్టుతో కాన్‌స్టాస్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
కొన్‌స్టాస్ సాధించిన రికార్డులు ఇవే..
👉ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్న వయస్కుడిగా కాన్‌స్టాస్ నిలిచాడు. 19 ఏళ్ల 85 రోజుల వయస్సులో కాన్‌స్టాస్ ఈ ఘనత సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఆసీస్ దిగ్గజం ఇయాన్ క్రెయిగ్ పేరిట ఉంది.
👉ఇదే మెల్‌బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 17 ఏళ్ల 239 రోజుల వయస్సులో క్రెయిగ్ అరంగేట్రం చేశాడు. కాగా ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో డెబ్యూ చేసిన యంగెస్ట్ ఓపెనర్ మాత్రం కాన్‌స్టాస్‌నే కావడం గమనార్హం.
👉టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌గా కాన్‌స్టాస్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ లెజెండరీ ఓపెనర్ ఆర్చీ జాక్సన్ పేరిట ఉండేది. 1928-29లో ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జాక్సన్(19 ఏళ్ల 149 రోజుల వయస్సు) ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో 95 ఏళ్ల జాక్సన్ అల్‌టైమ్ రికార్డును కాన్‌స్టాస్ బ్రేక్ చేశాడు.
👉ఓవరాల్‌గా ఏ పొజిషేన్‌లోనైనా ఆస్ట్రేలియా తరపున ఈ రికార్డు సాధించిన రెండో పిన్నవయష్కుడిగా కాన్‌స్టాస్ నిలిచాడు.ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కూడా ఇయాన్ క్రెయిగ్ అగ్రస్దానంలో ఉన్నాడు. క్రెయింగ్ 17 ఏళ్ల 240 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు.
👉అదే విధంగా భారత్‌పై టెస్ట్ అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా కాన్‌స్టాస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే కాన్‌స్టాస్ కంటే చిన్న వయస్సులోనే పాకిస్తాన్ దిగ్గజాలు ముస్తాక్ మహ్మద్, షాహిద్ అఫ్రిదిలు భారత్‌పై టెస్ట్ హాఫ్ సెంచరీలు చేశారు. కానీ వారిద్దరూ తమ టెస్ట్ అరంగేట్రంలో అర్ధ సెంచరీలు చేయలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment