నా బ్యాటింగ్ రికార్డ్ గురించి గూగుల్‌ని అడగండి: జస్ప్రీత్‌ బుమ్రా | Jasprit Bumrah jokes after reporter questions his batting skills | Sakshi
Sakshi News home page

నా బ్యాటింగ్ రికార్డ్ గురించి గూగుల్‌ని అడగండి: జస్ప్రీత్‌ బుమ్రా

Published Mon, Dec 16 2024 9:17 PM | Last Updated on Mon, Dec 16 2024 9:22 PM

 Jasprit Bumrah jokes after reporter questions his batting skills

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలుత బౌలింగ్‌లో విఫలమైన భారత్‌.. బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తోంది. మరోసారి భారత టాపార్డర్‌ కుప్పకూలింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు మాత్రమే చేసింది.

క్రీజులో కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు),రోహిత్ శర్మ (0 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 394 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో  445 పరుగులకు ఆలౌటైంది. 

భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా 6 వికెట్లతో సత్తాచాటాడు. అయితే మూడో రోజు ఆట అనంతరం విలేకరల సమావేశంలో బుమ్రా విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా భారత్‌ బ్యాటింగ్‌ ప్రదర్శనపై విలేఖరి అడిగిన ప్రశ్నకు బుమ్రా తనదైన స్టైల్లో సమాధనమిచ్చాడు.

రిపోర్టర్‌: హాయ్‌ జస్ప్రీత్‌.. బ్యాటింగ్‌పై మీ అంచనా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సరైన వ్యక్తి మీరు కానప్పటికీ, గబ్బాలోని పరిస్థితులను బట్టి మీ జట్టు బ్యాటింగ్‌ గురించి ఏమనుకుంటున్నారు?

 బుమ్రా: "ఇది ఆసక్తికరమైన ప్రశ్న. కానీ, మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. జోక్స్‌ను పక్కన పెడితే.. ఇది మరో కథ అని బుమ్రా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కాగా టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బుమ్రా పేరిటే ఉంది. 2022లో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో  బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు.
చదవండి: BCL 2024: శిఖర్‌ ధావన్‌ ఊచకోత.. కేవలం 29 బంతుల్లోనే! అయినా


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement