బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లతో మెరిశాడు. మిగతా బౌలర్లు విఫలమైనప్పటికి బుమ్రా మాత్రం తన పని తను చేసుకుపోయాడు.
సెంచరీలతో చెలరేగిన ట్రావిస్ హెడ్, స్మిత్ వంటి కీలక వికెట్లును పడగొట్టి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చాడు. కానీ బ్యాటర్లు మరోసారి చేతులెత్తేయడంతో టీమిండియాకు కష్టాలు తప్పలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.
భారత్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 394 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్(33), రోహిత్ శర్మ(0) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగిన బుమ్రా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
బుమ్రా సాధించిన రికార్డులు ఇవే..
👉ఆస్ట్రేలియాపై గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 50 టెస్టు వికెట్లు వికెట్లు పడగొట్టగా.. కుంబ్లే 49 వికెట్లు సాధించాడు.
ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు. బుమ్రా మరో రెండు వికెట్లు పడగొడితే కపిల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
👉ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్‌ను ఔట్ చేసిన బుమ్రా తన 190వ టెస్టు వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 20 కంటే తక్కువ సగటుతో 190 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా వరల్డ్ రికార్డు సృష్టించాడు. బుమ్రా 19.82 సగటుతో 190 వికెట్లను పడగొట్టాడు.
చదవండి: ‘నీకసలు మెదడు ఉందా?’.. భారత పేసర్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం!
Comments
Please login to add a commentAdd a comment