PC: Insidesport
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలమ ఫామ్ కొనసాగుతోంది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మొత్తంగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు భారత కెప్టెన్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.
ఇంగ్లండ్‌పై అదరగొట్టి..
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 455 పరుగులు చేసి ఈ ఏడాదిని అద్బుతంగా ఆరంభించిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. రోహిత్ తన ఆఖరి 15 ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు.
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీ(52) మినహా.. గత 14 ఇన్నింగ్స్‌లలో అతడు చేసింది 112 పరుగులు మాత్రమే. ఈ క్రమంలో రోహిత్ శర్మను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక ఆడింది చాలు రిటైర్మెంట్ ఇచ్చే రోహిత్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో మరోసారి హ్యాపీ రిటైర్మెంట్ రోహిత్ అనే హ్యాష్ ట్యాగ్ డ్రెండ్ అవుతోంది.
చదవండి: ఈజీ క్యాచ్‌లు విడిచిపెట్టిన జైశ్వాల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్
Rohit Sharma should retire not because he didn't perform but he didn't put his team's interest before him. There shouldn't be any place for selfish player in team India. #AUSvINDIA
— Cricket Devotee 🇮🇳 (@DevoteesCricket) December 30, 2024
Comments
Please login to add a commentAdd a comment