IND vs AUS 3rd Test Live Updates And highlights: బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 260 పరుగులకు ఆలౌటైంది.
బ్యాడ్ లైట్.. ముందుగానే టీ బ్రేక్
బ్రిస్బేన్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వాతావరణం ప్రధాన సమస్యగా మారింది. మరోసారి బ్యాడ్ లైట్ కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో ముందుగానే అంపైర్‌లు ట్రీ బ్రేక్‌ను ప్రకటించారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్: 8/0
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్
89/7 వద్ద ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను కంగారులు ఉంచారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ఆకాష్ దీప్ తలా రెండు వికెట్లు సాధించారు.
బుమ్రా ఈజ్ బ్యాక్..
ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కమ్మిన్స్.. బుమ్రా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 273 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
దూకుడుగా ఆడుతున్న కమ్మిన్స్..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూకుడగా ఆడుతున్నాడు. కేవలం 9 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 17 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 85/6. ఆస్ట్రేలియా ప్రస్తుతం 270 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆసీస్ ఆరో వికెట్ డౌన్..
ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన హెడ్.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 245 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
33 పరుగులకే 5 వికెట్లు..
రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 33 పరుగులకే ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 221 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాలుగో వికెట్ డౌన్..
సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. మిచెల్ మార్ష్ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 28/4.
ఆసీస్ మూడో వికెట్ డౌన్
మెక్‌స్వీనీ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మెక్‌స్వీనీ.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి ట్రావెస్ హెడ్ వచ్చాడు. 10 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/3.
ఆసీస్ రెండో వికెట్ డౌన్..
మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన లబుషేన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు.
ఆసీస్ తొలి వికెట్ డౌన్..
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు. 3 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 11/1. ఆస్ట్రేలియా ప్రస్తుతం 196 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
తగ్గిన వర్షం.. ముందుగానే లంచ్ బ్రేక్
బ్రిస్బేన్‌లో వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అయితే ఔట్ ఫీల్డ్ కాస్త తడిగా ఉండడంతో మైదానాన్ని సిద్దం చేసే గ్రౌండ్ స్టాప్ పడ్డారు. ఈ క్రమంలో ముందుగానే లంచ్ బ్రేక్‌ను అంపైర్‌లు ప్రకటించారు. సెకెండ్ సెషన్ తిరిగి మళ్లీ భారత కాలమానం ప్రకారం.. ఉదయం 8:10 గంటలకు ప్రారంభం కానుంది
వరుణుడు ఎంట్రీ..
ఇక ఐదో రోజు ఆటకు సైతం వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.
260 పరుగులకు టీమిండియా ఆలౌట్..
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. 252/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. పదో వికెట్‌గా ఆకాష్ దీప్(31).. ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం 185 పరుగుల వెనకంజలో భారత్ ఉంది.
భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఆఖరిలో ఆకాష్ దీప్(31), బుమ్రా(10) విరోచిత పోరాటం చేశారు. దీప్, బుమ్రా నమోదు చేసిన 47 పరుగుల భాగస్వామ్యం ఫలితంగానే భారత్ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది.
ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 4 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ 3, హాజిల్‌వుడ్, హెడ్, నాథన్ లియోన్ తలా వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment