భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టెస్ట్‌ల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో (రెండో ఇన్నింగ్స్) ట్రవిస్ హెడ్ వికెట్ పడగొట్టడం ద్వారా బుమ్రా ఈ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 20 కంటే తక్కువ సగటుతో (19.38) 200 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా బుమ్రా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అలాగే భారత్ తరఫున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 200 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
భారత్ తరఫున అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్‌లో చేరిన బౌలర్లు..
జస్ప్రీత్ బుమ్రా 8484
మొహమ్మద్ షమీ 9896
అశ్విన్ 10248
కపిల్ దేవ్ 11066
రవీంద్ర జడేజా 11989
అత్యుత్తమ బౌలింగ్ సగటు (Min 200 వికెట్లు)
బుమ్రా 19.38
మాల్కమ్ మార్షల్ 20.94
జోయల్ గార్నర్ 20.97
కర్ట్లీ ఆంబ్రోస్ 20.99
అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లు..
వకార్ యూనిస్ 7725
డేల్ స్టెయిన్ 7848
రబాడ 8154
బుమ్రా 8484
మాల్కమ్ మార్షల్ 9234
- బుమ్రా తన 200 టెస్ట్ వికెట్ల మార్కును 44వ మ్యాచ్‌లో అందుకున్నాడు. కమిన్స్, రబాడ కూడా ఈ మైలురాయిని 44వ మ్యాచ్‌లోనే చేరుకున్నారు.
- మ్యాచ్‌ల పరంగా అశ్విన్ (38) మాత్రమే బుమ్రా (44) కంటే వేగంగా 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే నాలుగు వికెట్లు తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా.. కొన్‌స్టాస్, హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీలను ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ఆ జట్టు ఆధిక్యం 207 పరుగులుగా ఉంది. లబూషేన్ (48), కమిన్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment