బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ అనంతరం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మీడియా కథనాల మేరకు ఆంధ్ర యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని భారత జట్టుకు ఎంపిక చేస్తారని తెలుస్తుంది. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్ ఎంపిక జరగవచ్చని ప్రచారం జరుగుతుంది.
ఆస్ట్రేలియా కండీషన్స్‌లో నితీశ్ సీమ్ బౌలింగ్ భారత్‌కు లబ్ది చేకూరుస్తుందని సెలెక్టర్లు భావిస్తున్నారట. మరోవైపు ఇదే సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బెర్త్ కోసం శార్దూల్ ఠాకూర్ కూడా పోటీ పడుతున్నాడని తెలుస్తుంది. శార్దూల్‌కు గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉండటంతో సెలెక్టర్లు ఇతని పేరును కూడా పరిశీలిస్తునట్లు సమాచారం. బీజీటీ కోసం శార్దూల్, నితీశ్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
కాగా, 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో నితీశ్ ఓ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్శించాడు. నితీశ్ ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ విశేషంగా రాణించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత-ఏ జట్టులో కూడా నితీశ్ చోటు దక్కించుకున్నాడు.
నవంబర్ 22 నుంచి మొదలు..
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 3తో ఈ పర్యటన ముగియనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు జంబో జట్టును ఎంపిక చేస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment