
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టారు. తొలుత నితీశ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత సన్వీర్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌లు పట్టి హైలైటయ్యారు.
సన్వీర్ సూపర్ క్యాచ్
భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సన్వీర్ మిడ్ ఆన్ దిశగా ముందుకు పరిగెడుతూ అద్భుతమన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. సన్వీర్ క్యాచ్ పట్టిన విధానం క్లారిటీగా లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా రీ ప్లేలో స్పష్టమైన క్యాచ్‌గా తేలింది. దీంతో బ్యాటర్ స్టోయినిస్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్యాచ్ చూసిన జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
- First Nitish Reddy.
- Then Sanvir Singh.
- Two Incredible Catches by these SRH's youngsters. 🤯🙌 pic.twitter.com/DHtMenorn5— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024
నితీశ్ అద్భుత విన్యాసం
సన్వీర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు ముందు నితీశ్ కుమార్ రెడ్డి కూడా సూపర్ క్యాచ్ పట్టాడు. భువీ బౌలింగ్‌లోనే నితీశ్ బౌండరీ లైన్ వద్ద చూడచక్కని క్యాచ్ అందుకున్నాడు. సిక్సర్‌కు వెళ్లాల్సిన బంతిని నితీశ్ అద్భుతంగా బ్యాలెన్స్ చేసి తన జట్టుకు 6 పరుగులు ఆదా చేయడంతో పాటు కీలకమైన డికాక్‌ను పెవిలియన్‌కు సాగనంపాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు మైదానంలో చాలా చురుగ్గా కదులుతున్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో.. భువీ దెబ్బకు (3-0-7-2) 9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. డికాక్ (2), స్టోయినిస్ (3) పెవిలియన్‌కు చేరగా.. రాహుల్ (22), కృనాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment