న్యూఢిల్లీ: ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ దూరమైన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో ఐపీఎల్ ఆరంభం కానున్న తరుణంలో రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించాల్సిన స్మిత్.. ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకోవడంతో అతనికి ఉద్వాసన తప్పలేదు. అయితే అతని స్థానంలో కెప్టెన్‌గా ఇప్పటికే అజింక్యా రహానేను ప్రకటించిన రాజస్తాన్ రాయల్స్.. ఆటగాడిగా స్మిత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే విషయంలో తర్జన భర్జనలు పడుతోంది. కాగా, స్మిత్ స్థానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్‌తో రిప్లేస్ చేసేందుకు ఆసక్తిచూపుతోంది. దీనిలో భాగంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు రాజస్తాన్ రాయల్స్ ఓ లేఖ రాసింది. క్లాసెన్‌ను తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ బీసీసీఐకి విన్నవించింది.
జోరూట్, ఆమ్లాలకు నో..
స్టీవ్ స్మిత్ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్, దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ హషీమ్ ఆమ్లాల వెనక్కి నెట్టి మరీ క్లాసెన్ రేసులోకి రావడం గమనార్హం. ముందుగా రూట్, ఆమ్లాల పేర్లను పరిశీలించినా, చివరకు క్లాసెన్ వైపే రాజస్తాన్ రాయల్స్ మొగ్గుచూపింది. ఇందుకు కారణం క్లాసెన్ వికెట్ కీపర్ కావడమే. క్లాసెన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కావడంతోనే అతనిపై ఆసక్తి చూపినట్లు రాజస్తాన్ క్రికెట్ హెడ్ జుబిన్ బరుచా తెలిపారు. ఐపీఎల్‌లో స్పిన‍్నర్ల పాత్ర అధికంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని స్సిన్‌ను బాగా ఆడే క్లాసెన్‌కు ఓటేసినట్లు పేర్కొన్నారు. అయితే క్లాసెన్‌ను తీసుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment