Heinrich klaasen 174: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడు. 83 బంతుల్లో 13, 13 సిక్సర్ల సాయంతో ఏకంగా 174 పరుగులు సాధించాడు.
టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు
57 బంతుల్లోనే సెంచరీ సాధించిన క్లాసెన్.. వన్డే ఫార్మాట్లో ఐదో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 416 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో 400కు పైగా స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ఆసీస్‌పై 164 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సమం
మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కంగారూలు.. తొలి రెండు వన్డేల్లోనూ జయభేరి మోగించారు. ఈ క్రమంలో వరుస ఓటముల నుంచి తేరుకున్న ఆతిథ్య ప్రొటిస్ జట్టు మూడో మ్యాచ్‌లో 111 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
ఆసీస్‌కు ఊహించని షాక్‌లు
ఈ క్రమంలో శుక్రవారం ఇరు జట్లు సెంచూరియన్ వేదికగా నాలుగో వన్డేలో తలపడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు హెన్రిచ్ క్లాసెన్ చుక్కలు చూపించాడు. అద్భుత శతకంతో మెరిసి.. సౌతాఫ్రికాకు 416 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇక లక్ష్య ఛేదనలో కంగారూలకు ఊహించని షాక్‌లు తగిలాయి.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. ట్రవిస్ హెడ్ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలెక్స్ క్యారీ 99 పరుగులతో పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరుస వికెట్లు కోల్పోవడంతో 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్.. 164 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
వన్డేల్లో అత్యధికసార్లు 400కు పైగా స్కోర్లు నమోదు చేసిన జట్లు
►సౌతాఫ్రికా- 7 సార్లు
►టీమిండియా- 6 సార్లు
►ఇంగ్లండ్- 5 సార్లు
►ఆస్ట్రేలియా- 2 సార్లు
►శ్రీలంక- 2 సార్లు.
చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ
#Klassen🥵@Heini22 🔥#OrangeArmy 💥@SunRisers 🧡#SAvsAUS😺😸 pic.twitter.com/DEoOrZuCpp
— Bhagi👰 (@orangearmylub) September 16, 2023
💯 for Klassen infront of his home crowd !!
— Karthik Rao (@Cric_Karthikk) September 15, 2023
100(57)*
He was batting on 29(28)
Scored the next 71 runs off 29 balls#Klassen #SAvAus pic.twitter.com/wCrMXYiB0r
What a Finish by #Klassen #CSA pic.twitter.com/Vn95QIvIqE
— sivakumar (@sivakumar90) September 15, 2023
Comments
Please login to add a commentAdd a comment