క్లాసెన్ బ్యాటింగ్(PC: AP)
India Vs South Africa 2nd T20- Heinrich Klaasen: టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రొటిస్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. కెప్టెన్ తెంబా బవుమా(35 పరుగులు) మినహా టాపార్డర్ చేతులెత్తేసిన వేళ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.
కటక్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి 81 పరుగులు చేశాడు. కెరీర బెస్ట్ స్కోరు సాధించాడు. తద్వారా టీమిండియాపై ప్రొటిస్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందడంలో తన వంతు సహాయం చేశాడు.
ఈ క్రమంలో క్లాసెన్ క్వింటన్ డి కాక్ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక స్కోరు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు క్వింటన్ పేరిట ఉండేది. 2019లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో డి కాక్ 79 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక ప్రొటిస్ రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ గాయపడటంతో క్లాసెన్ తుది జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించడంతో పాటు ఇలా డి కాక్ రికార్డును అధిగమించాడు క్లాసెన్.
ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్లాసెన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘బస్సులో ఉన్న సమయంలో క్విన్నీ(డి కాక్) తన మణికట్టుకు గాయమైందని నాతో చెప్పాడు. గాయం తీవ్రతరం కావడంతో అతడి స్థానంలో నేను ఆడబోతున్నానని నిన్ననే నాకు తెలిసింది.
కొత్త బంతితో కాస్త కష్టమే. అయితే, నేను స్పిన్నర్లకు టార్గెట్ చేయాలనుకున్నాను. అందులో సఫలమయ్యాను. భారత్‌లో ఇలాంటి స్కోరు సాధించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. సహాయక సిబ్బంది మొదలు ప్రతి ఒక్కరు నాకు మద్దతుగా నిలిచారు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక రెండో టీ20లో విజయంతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య భారత్‌పై 2-0 తేడాతో పైచేయి సాధించింది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా రెండో టీ20:
టాస్: దక్షిణాఫ్రికా- తొలుత బౌలింగ్
భారత్ స్కోరు: 148/6 (20)
దక్షిణాఫ్రికా స్కోరు: 149/6 (18.2)
విజేత: 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హెన్రిచ్ క్లాసెన్(46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు)
చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే!
ICC World Cup Super League: రోజుల వ్యవధిలోనే అంతా తలకిందులు.. అక్కడ క్లీన్‌స్వీప్ చేసి.. ఇక్కడ వైట్‌వాష్‌కు గురై!
Comments
Please login to add a commentAdd a comment