అదరగొట్టిన లిండే.. ఓటమి పాలైన పా​కిస్తాన్‌ | South Africa Beat Pakistan By 6 Wickets 2nd T20I | Sakshi
Sakshi News home page

లిండే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. పాక్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

Published Tue, Apr 13 2021 8:07 AM | Last Updated on Tue, Apr 13 2021 9:28 AM

South Africa Beat Pakistan By 6 Wickets 2nd T20I - Sakshi

జొహెన్నెస్‌బర్గ్‌: జార్జి లిండే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (3/23; 10 బంతుల్లో 20 నాటౌట్‌; 2 సిక్స్‌లు) కనబర్చడంతో... పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (50; 5 ఫోర్లు), హఫీజ్‌ (32; 6 ఫోర్లు) రాణించారు. లిండేకు తోడు విలియమ్స్‌ కూడా 3 వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. మార్క్‌రమ్‌ (54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)... క్లాసెన్‌ (36; 4 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఆల్‌రౌండ్‌ షోతో అదరొట్టిన జార్జి లిండే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు. కాగా 3 వన్డేల సిరీస్‌ను పాక్‌ 2-1తో కైవసం చేసుకోగా, నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి.

చదవవండి: ఐపీఎల్‌ కాసుల వర్షం కురిపిస్తుంది.. కాబట్టి: పాక్‌ మాజీ పేసర్‌ 
ఐపీఎల్‌ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement