KKR Vs SRH: క్లాసెన్‌ సిక్సర్ల సునామీ.. ఓడినా నీవే మా హీరో! వీడియో వైర‌ల్‌ | IPL 2024: Netizens Praises Heinrich Klaasen Over His Performance In Match Between KKR Vs SRH, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 KKR Vs SRH Videos: క్లాసెన్‌ సిక్సర్ల సునామీ.. ఓడినా నీవే మా హీరో! వీడియో వైర‌ల్‌

Published Sun, Mar 24 2024 6:30 AM | Last Updated on Sun, Mar 24 2024 11:24 AM

IPL 2024:Heinrich klaasen you beauty hats off - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ తన విరోచిత పోరాటంతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో  క్లాసెన్ అద్భుతమైన పోరాటం కనబరిచాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్.. కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు.  తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను గెలుపుంచుల దాకా తీసుకువెళ్లిన క్లాసెన్ ఆఖరిలో అనుహ్యంగా ఔటయ్యాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 8 సిక్స్‌లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు.

ముఖ్యంగా కేకేఆర్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను క్లాసెన్ ఉతికారేశాడు.  అతడి ఇన్నింగ్స్‌కు  అభిమానులు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వర్షం కురిపించాడు. ఓడినా నీవే మా హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

 ఆఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో చివరి ఓవర్ వేసే బాధ్యతను కేకేఆర్ కెప్టెన్ అయ్యర్ పేసర్ హర్షిత్ రానాకు అప్పగించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతినే క్లాసెన్ సిక్స్‌గా మలిచాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ విజయ సమీకరణం చివరి 5 బంతుల్లో 7 పరుగులు మారింది.

క్లాసెన్ క్రీజులో ఉండడంతో ఎస్‌ఆర్‌హెచ్‌దే విజయమని అనుకున్నారు. కానీ అనుహ్యంగా షాబాజ్ అహ్మద్‌, క్లాసెన్ వరుస క్రమంలో ఔట్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ 4 పరుగుల తేడాతో పరాజయం చవి చూడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement