
డుమినీ-క్లాసెన్
సెంచూరియన్: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసన్ చెలరేగిపోయి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 69 పరుగులు సాధించాడు. అయితే భారత స్సిన‍్నర్ యజ్వేంద్ర చాహల్ వేసిన 13వ ఓవర్‌లో క్లాసెన్-డమినీలు కలిసి 23 పరుగులు సాధించడంతో మ్యాచ్ దక్షిణాఫ‍్రికా వైపు టర్న్ అయ్యింది. ఇందులో 17 పరుగులు క్లాసెన్ సాధించినవే కావడం విశేషం.
అయితే మ్యాచ్ అనంతరం తన హిట్టింగ్‌పై క్లాసెన్ మాట్లాడుతూ..'లెగ్ స్పిన్నర్లని ఆడటం నాకు చాలా ఇష్టం. అందుకే చాహల్ బౌలింగ్‌లో హిట్టింగ్‌కు చేశా. నా కెరీర్‌లో ఇంకా చాలామంది లెగ్‌స్పిన్నర్లని ఎదుర్కోవాల్సి ఉంది. మాకు కీలకమైన రెండో టీ20లో నా వ్యూహం ఫలించింది. నేను బంతిని ఎక్కడకు ఎలా పంపిచాలనుకున్నానో అది చేసి చూపించా. నేను హిట్టింగ్ చేస్తానని చాహల్ అస్సలు ఊహించి ఉండడు. ఇలా ఆడాలనే గేమ్ ప్లాన్‌తో నేను క్రీజ్‌లోకి రాలేదు. అప్పటి పరిస్థితిని బట్టి మాత్రమే ఆడా. చాహల్ వేసిన ఓవర్‌లో 20 పరుగులు సాధించాలనే లక్ష్యంతో ఎదురుదాడికి దిగా' అని క్లాసన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment