ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఇవాళ (అక్టోబర్ 31) విడుదల చేశాయి. ఈ జాబితాలో అందరూ ఊహించిన విధంగానే ఎంపికలు జరిగాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తమ కెప్టెన్లను వదిలేసి పెద్ద సాహసమే చేశాయి. మరి కొన్ని ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను తప్పని పరిస్థితుల్లో వేలానికి వదిలేశాయి.
ఐపీఎల్ 2025 రిటెన్షన్స్ అందరూ ఊహించినట్టుగా విరాట్‌కు కాని రోహిత్‌కు కాని అత్యధిక ధర దక్కలేదు. వీరిద్దరితో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక ధర దక్కింది. క్లాసెన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా రూ. 23 కోట్లు వెచ్చించింది. భారత స్టార్ల విషయానికొస్తే.. విరాట్‌కు రూ. 21 కోట్లు.. రోహిత్‌కు రూ. 16.30 కోట్లు లభించాయి. ఐపీఎల్ రిటెన్షన్‌లో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. విరాట్‌తో సమానంగా లక్నో ఆటగాడు నికోలస్ పూరన్‌కు కూడా రూ. 21 కోట్లు లభించాయి.
పాట్ కమిన్స్ (సన్‌రైజర్స్), రుతురాజ్ (సీఎస్‌కే), బుమ్రా (ముంబై), రషీద్ ఖాన్ (గుజరాత్), సంజూ శాంసన్‌లకు (రాజస్థాన్), యశస్వి జైస్వాల్ (రాజస్థాన్), రవీంద్ర జడేజా (సీఎస్‌కే) రూ. 18 కోట్లు దక్కాయి. అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద ఎంఎస్ ధోనికి అత్యల్పంగా రూ. 4 కోట్లు దక్కాయి. కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ జాక్ పాట్ కొట్టాడు. అతని పారితోషికం రూ. 55 లక్షల నుంచి రూ. 13 కోట్లకు పెరిగింది.
చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల
Comments
Please login to add a commentAdd a comment