మనం గెలిచాం: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు) | Dhanashree Verma Poses With Anushka Sharma After India Vs Pakistan Match, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Dhanashree Verma Photos: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు)

Published Mon, Jun 10 2024 9:44 PM | Last Updated on

Dhanashree Verma poses with Anushka Sharma Photos1
1/15

టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి వైరల్‌గా మారారు. పాకిస్తాన్‌పై భారత జట్టు విజయం నేపథ్యంలో ఆమె షేర్‌ చేసిన ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Dhanashree Verma poses with Anushka Sharma Photos2
2/15

కాగా అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌-2024కు ఎంపికైన భారత జట్టులో చహల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.

Dhanashree Verma poses with Anushka Sharma Photos3
3/15

దీంతో చాలాకాలం తర్వాత అతడు జాతీయ జట్టులో తిరిగి అడుగుపెట్టాడు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos4
4/15

అయితే, గ్రూప్‌ దశలో భాగంగా టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో చహల్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos5
5/15

న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌ల నేపథ్యంలో తుదిజట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ రెండు మ్యాచ్‌లలోనూ భారత జట్టు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లకే పెద్దపీట వేసింది.

Dhanashree Verma poses with Anushka Sharma Photos6
6/15

అదే విధంగా ముగ్గురు స్పెషలిస్టు పేసర్లు జస్‌‍ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌లతో బరిలోకి దిగింది.ఇదిలా ఉంటే.. యజువేంద్ర చహల్‌తో పాటు అతడి భార్య, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ కూడా అమెరికా వెళ్లారు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos7
7/15

వీరితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Dhanashree Verma poses with Anushka Sharma Photos8
8/15

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం తర్వాత ధనశ్రీ వర్మ ఓ ఫొటో షేర్‌ చేశారు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos9
9/15

‘‘మనం గెలిచేశాం’’ అన్న క్యాప్షన్‌తో పంచుకున్న ఈ ఫొటోలో.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ధనశ్రీ విక్టరీ సింబల్‌ చూపుతూ కనిపించారు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos10
10/15

కాగా యూట్యూబర్‌, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ధనశ్రీ వర్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆమె ట్రోలింగ్‌ బారిన పడ్డారు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos11
11/15

ముఖ్యంగా టీమిండియా స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో ఆమె పేరును ముడిపెట్టి దారుణంగా ట్రోల్‌ చేశారు కొంతమంది నెటిజన్లు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos12
12/15

కేవలం ఫేమ్‌ కోసమే చహల్‌ను ధనశ్రీ పెళ్లాడారని.. అతడికి అన్యాయం చేసేందుకు ఆమె ఏమాత్రం వెనుకాడంటూ వ్యక్తిత్వ హననం చేసేలా కామెంట్లు చేశారు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos13
13/15

విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ప్రచారం చేశారు. అయితే, ఆ సమయంలో చహల్‌ భార్యకు అండగా నిలిచాడు.

Dhanashree Verma poses with Anushka Sharma Photos14
14/15

ధనశ్రీ సైతం ట్రోల్స్‌కు గట్టిగానే బదులిచ్చి మానసికంగా తాను స్ట్రాంగ్‌ అని చెప్పకనే చెప్పారు.‌

Dhanashree Verma poses with Anushka Sharma Photos15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement