
Virat Kohli- Vamika: బిజీ బిజీగా గడిపే టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి తన గారాలపట్టి వామికాకు సమయం కేటాయించాడు. స్విమ్మింగ్‌పూల్‌లో తన చిన్నారి కూతురితో సేద తీరుతున్న ఫొటోను మంగళవారం పంచుకున్నాడు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్-2023లో బెంగళూరు వేదికగా ఆర్సీబీ- లక్నో మధ్య మ్యాచ్ జరిగింది.
తప్పని ఓటమి
సొంత మైదానంలో ఆడిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే, హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆఖరికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో విజయం ఖరారైంది. దీంతో డుప్లెసిస్ బృందానికి రాహుల్ సేన చేతిలో ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.
సెలబ్రిటీ ఇమేజ్‌కు దూరం
ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మ్యాచ్ ముగించుకున్న కోహ్లి తనకు దొరికిన కాస్త విరామం కూతురితో గడిపాడు. కాగా 2017లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు జనవరి 2021లో కూతురు వామిక జన్మించింది. అయితే, విరుష్క జంట మాత్రం ఇంతవరకు వామిక ఎలా ఉంటుందో అభిమానులకు చూపించలేదు.
తమ కూతురిని సెలబ్రిటీ ఇమేజ్‌కు ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు ఇప్పటికే కోహ్లి- అనుష్క అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తన పూర్తి రూపాన్ని చూపించనప్పటికీ ఆమెతో గడిపిన అద్భుత క్షణాలను ఇలా కెమెరాలో బంధిస్తూ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.
చదవండి: అప్పుడేమో నోరు మూయాలన్నాడు! తర్వాత కోహ్లితో ఇలా.. గంభీర్ ఫొటో వైరల్
— Virat Kohli (@imVkohli) April 11, 2023
Comments
Please login to add a commentAdd a comment