
Virat Kohli- Anushka Sharma: టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. భార్య పుట్టినరోజు సందర్భంగా.. ‘‘నా సర్వస్వం నువ్వే’’ అంటూ అందమైన ఫొటోలతో విషెస్ తెలిపాడు. కాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు జంటగా ‘‘రబ్ నే బనాదీ జోడీ’’ సినిమాతో తెరంగేట్రం చేసింది అనుష్క.
అనతికాలంలోనే బీ-టౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె.. 2013లో ఓ కమర్షియల్ యాడ్ సందర్భంగా టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసింది. ఈ క్రమంలో ప్రేమలో పడిన విరుష్క.. నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఈ క్రమంలో 2017లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటైంది. వీరికి 2021లో కూతురు వామిక జన్మించింది.
దేవుడే కలిపాడు.. జోడీ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా..
విరాట్ కోహ్లి- అనుష్క శర్మ కపుల్ గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. క్రికెటర్‌గా కోహ్లి, నటిగా అనుష్క తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారు.
కోహ్లి మ్యాచ్ ఆడిన ప్రతిసారి అనుష్క స్టేడియానికి వచ్చి అతడిని ఉత్సాహపరుస్తుంది. కోహ్లి సైతం భార్య షూటింగ్‌లతో బిజీగా ఉన్నపుడు ఆమెకు తగిన స్పేస్ ఇస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా విహారయాత్రలకు తీసుకువెళ్తూ ఉంటాడని వారి సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడవుతూ ఉంటుంది.
నీ చేయి వీడను
ఈ క్రమంలో మే 1న అనుష్క శర్మ 35వ పుట్టినరోజును పురస్కరించుకుని కోహ్లి ఆత్మీయ ట్వీట్ చేశాడు. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీ చేయి వీడను. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా నీకు నేను తోడుంటాను.
నీతోపాటు నీకున్న అలవాట్లను కూడా అంతే ప్రేమిస్తాను. నా సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ అనుష్కపై ప్రేమను కురిపించాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మకు సంబంధించిన ఫొటోలను కోహ్లి పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను ఉద్దేశించి కోహ్లి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
దంచి కొడుతున్న కోహ్లి
ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్నాడు. అనూహ్య పరిస్థితుల్లో ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు కోహ్లి. ఇక బ్యాటర్‌గానూ అదరగొడుతున్న ఈ రన్‌మెషీన్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి 333 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో నాలుగింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: ఆసియా కప్ రద్దు? పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!?
Love you through thick, thin and all your cute madness ♾️. Happy birthday my everything ❤️❤️❤️ @AnushkaSharma pic.twitter.com/AQRMkfxrUg
— Virat Kohli (@imVkohli) May 1, 2023
Comments
Please login to add a commentAdd a comment