
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ టెస్టు కూడా కేవలం రెండునర్న రోజుల్లోనే ముగిసిపోయింది. అయితే విజయం మాత్రం ఈ సారి ఆస్ట్రేలియాను వరించింది. ఇక ఇండోర్ టెస్టు ముగిసిన అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన కుటుంబంతో కలిసి ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకున్నాడు.
విరాట్, అతడి సతీమణి అనుష్క శర్మ భక్తులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లి.. టెస్టుల్లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.
ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన విరాట్ కేవలం 113 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉంది. ఇక ఆసీస్-భారత్ మధ్య ఆఖరి టెస్టు అహ్మదాబాద్ వేదికగా మార్చి9 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: PSL 2023: ఆజాం ఖాన్ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో! పాపం వసీం
#WATCH | Madhya Pradesh: Actor Anushka Sharma & Cricketer Virat Kohli visit Mahakaleshwar temple in Ujjain. pic.twitter.com/NKl8etcVGR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 4, 2023
Comments
Please login to add a commentAdd a comment