
PC: IPL.com
చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క వికెట్ తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సందడి చేసింది. స్టాండ్స్‌లో కూర్చోని ఆర్సీబీ జట్టును సపోర్ట్ చేసింది. ముఖ్యంగా కోహ్లి బౌండరీ బాదినప్పుడు, ఫీల్డ్‌లో క్యాచ్ పట్టినప్పుడు ఆమె లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మరింత జోష్ నింపింది.
రాహుల్ క్యాచ్ పట్టిన కింగ్.. అనుష్క రియాక్షన్
ఇక ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆది నుంచే ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి సిరాజ్ బౌలింగ్‌లో స్వ్కెర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి.. విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇక రాహల్ క్యాచ్ పట్టిన కోహ్లి గట్టిగా అరుస్తూ వైల్డ్ సెలబ్రేషన్స్ జరపుకున్నాడు.
ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తన భర్తను ఆభినందించింది. వీరిద్దరి రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు.
చదవండి: Avesh Khan: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్‌కు ఊహించని షాక్!
Kohli Anushka Reaction on KL Rahul Catch pic.twitter.com/wVEA0dblYh
— Aakash Chopra (@Aakash_Vani_1) April 10, 2023
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
— IndianPremierLeague (@IPL) April 10, 2023
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT