
PC: twitter
ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఊహించని విధంగా ఔటయ్యాడు. 227 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి అద్భుతమైన శుభారంభం ఇవ్వాలని విరాట్ కోహ్లి భావించాడు. తొలి బంతి నుంచే కోహ్లి దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ఆకాష్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లో మూడో బంతిని విరాట్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే దురదృష్టవశాత్తూ బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని కోహ్లి బూటుకి తాకి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన విరాట్‌తో పాటు స్టేడియంలో అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్‌ను వీక్షిస్తోన్న కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: SRH Vs MI: తిలక్ ఇంట్లో డిన్నర్.. తరలివచ్చిన సచిన్, రోహిత్, సూర్య! ఫొటోలు వైరల్
— Billu Pinki (@BilluPinkiSabu) April 18, 2023
Comments
Please login to add a commentAdd a comment