బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రస్తుతం తన భర్త ప్రౌడ్ మూమెంట్‌ను ఆస్వాదిస్తోంది. నిన్న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టిమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ భర్త విజయాన్ని చూసి గర్వపడుతోంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసింది.
చదవండి: చిరంజీవి మెసేజ్‌ను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలు విషయం చెప్పిన మెగాస్టార్
గ్రౌండ్‌లో సెంచరీ చేసిన అనంతరం విరాట్ ఇచ్చిన ఎక్‌ప్రెషన్ ఫొటోను షేర్ చేస్తూ మురిసిపోయింది. ఇక ఈ ఫొటోకు ‘ఏం ఆటగాడు.. ఏం ఇన్నింగ్స్ ఆడాడు. శభాష్’ అంటూ కోహ్లి విజయాన్ని కొనియాడింది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో విరాట్ 110 బంతుల్లో 166 పరుగులు సాధించి మరో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సెంచరీలో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. తన కెరీర్‌లో 46వ వన్డే సెంచరీని ఖాతాలో వేసుకుని ఫలితంగా వన్డేల్లో మొత్తం 12,754 పరుగులు చేసి రికార్డుకు ఎక్కాడు ఈ స్టార్ బ్యాటర్.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ను రెండు సార్లు చూశానన్న ‘అవతార్’ డైరెక్టర్, జక్కన్నపై ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment