
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఫిబ్రవరిలో తమ రెండో సంతానానికి జన్మనిచ్చారు.

వామికకు తమ్ముడు పుట్టాడని.. అతడి పేరు అకాయ్ అని వెల్లడించారు.

లండన్‌లో అనుష్క ప్రసవం నేపథ్యంలో కోహ్లి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

అయితే, ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓపెనర్‌గా తిరిగి జట్టుతో చేరాడు.

వామిక, అకాయ్‌లతో అనుష్క మాత్రం కొన్నాళ్లు లండన్‌లోనే ఉండిపోయింది.

ఇటీవలే అనుష్క తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇండియాకు తిరిగి వచ్చింది.

మే 1న అనుష్క శర్మ బర్త్ డే.

ఈ క్రమంలో.. ‘‘నువ్వు లేకుంటే నేను లేను’’ అంటూ ప్రియమైన భార్యకు విషెస్ తెలిపాడు కోహ్లి.

అంతేకాదు.. అనుష్క బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు కూడా.

KGF(కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్)తో కలిసి అనుష్క తన పుట్టినరోజు వేడుక జరుపుకొంది.

కుమారుడు అకాయ్ జన్మించిన తర్వాత విరాట్ కోహ్లి- అనుష్క శర్మ జంటగా కనిపించడం ఇదే తొలిసారి.

ఆర్సీబీ ఓపెనర్‌గా కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

10 మ్యాచ్‌లలో కలిపి 500 రన్స్ పూర్తి చేసుకున్నాడు.







