
Anushka Sharma Step Away From Production Banner For Her First Love: బాలీవుడ్ బ్యూటీ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. తన నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అనుష్క శర్మ తన సోదరుడు కర్నేష్‌తో కలిసి గతంలో 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' బ్యానర్‌ను నెలకొల్పింది. ఈ బ్యానర్ నుంచి సినిమాలు, సిరీస్‌లు కూడా ప్రొడ్యూస్ చేసింది. అయితే తాజాగా అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెట్టిన పోస్ట్ ప్రకారం ఇకనుంచి ఆ బ్యానర్‌లో భాగం కాదని చెప్పేసింది. ఎందుకంటే తనకున్న మొత్తం సమయాన్ని ఓ తల్లిగా, నటనకే పరిమితం చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది.
ఈ పోస్ట్‌లో 'నేను నా సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి 'క్లీన్ స్లేట్ ఫిలీమ్స్'ను ప్రారంభించినప్పుడు మేము కొత్త వాళ్లమే. కానీ మాకు పట్టుదల ఉంది. ఇప్పటివరకు మేము చేసిన ప్రయాణాన్ని చూసి గర్వపడుతున్నాను. ఈరోజు సీఎస్‌ఎఫ్ (క్లీన్ స్లేట్ ఫిల్మ్స్) విజయం సాధించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కర్నేష్‌కి అభినందనలు చెప్పాలి. ఇకనుంచి నేను నటిగా, ఓ తల్లిగా నా పూర్తి సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నాను. నాకున్న ఉన్న ఈ సమయాన్ని నా ఫస్ట్ లవ్, నటనకు అంకితం ఇస్తున్నాను.' అంటూ రాసుకొచ్చింది. అక్టోబర్ 2013లో 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్'ను అనుష్క శర్మ స్థాపించింది. ఈ బ్యానర్‌లో చివరగా 2022లో 'పాతాళ్ లోక్', 'బులుబుల్' వెబ్ సిరీస్‌లు విడుదల అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment