
భార్య అనుష్కతో విరాట్ (PC: Virat Kohli/Anushka Sharma Instagram)
Virat Kohli With His Wife Anushka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన కోహ్లి.. తన సమకాలీన క్రికెటర్లకు అందనంత ఎత్తులో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీల సెంచరీలు బాదుతూ.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నాడు.
Photo Credit: Virat Kohli Instagram
ఇక తన బ్యాటింగ్ నైపుణ్యాలతో అభిమానులను అలరిస్తున్న కోహ్లి వ్యక్తిగత జీవితంలోనూ వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ ఢిల్లీ బ్యాటర్‌కు భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతో సమయం గడపడం ఇష్టం.
Photo Credit: Virat Kohli Instagram
వాళ్లిద్దరే అతడి పంచప్రాణాలు. ‘‘ప్రౌడ్ హజ్బెండ్, ప్రౌడ్ ఫాదర్’’ అంటూ తన ట్విటర్ బయోలో రాసుకున్న కోహ్లికి వారిద్దరిపై ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా అనుష్క, వామిక కోహ్లి వెంట ఉండాల్సిందే!
Photo Credit: Virat Kohli Instagram
ఇక ఐపీఎల్-2023 నేపథ్యంలో విరాట్ మళ్లీ ఫుల్ బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు దొరికిన సమయాన్ని సతీమణి అనుష్కతో గడిపాడు. ముంబైలోని ఓ ఈవెంట్‌కు హాజరైన విరుష్క జోడీ ఫొటోలకు పోజులిచ్చింది. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2023లో ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: IPL 2023 Captains Salaries: సూపర్ క్రేజ్.. సంపాదన కోట్లలో.. ఐపీఎల్ కెప్టెన్ల ‘బలగం’.. బలం! వీరి గురించి తెలుసా? పాపం అతడొక్కడే!
WC 2023: 44 ఏళ్ల తర్వాత.. ‘వరల్డ్‌కప్ రేసు’ నుంచి లంక అవుట్! ఎందుకిలా? కివీస్ వల్లే అప్పుడలా..