ఆందోళన చెందుతున్న స్టార్ హీరో! | lack of cinema halls in India, says Salman Khan | Sakshi
Sakshi News home page

ఆందోళన చెందుతున్న స్టార్ హీరో!

Published Fri, Mar 25 2016 4:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆందోళన చెందుతున్న స్టార్ హీరో! - Sakshi

ఆందోళన చెందుతున్న స్టార్ హీరో!

ముంబై: దేశంలో సినిమా థియేటర్ల పరిస్థితిపై బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఆందోళన చెందుతున్నాడు. భారత్ లో సినిమా థియేటర్లు చాలా తక్కువగా ఉన్నాయని వీటి సంఖ్యలో భారీ మార్పులు రావాలని అభిప్రాయపడ్డాడు సల్మాన్. నగర శివార్లలో మరిన్ని సినిమా హాల్స్ ఉంటే బాగుంటుందని, 10 వేల థియేటర్లు కావాలని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అలీ అబ్బాస్ జహీర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సుల్తాన్' మూవీ షూటింగ్ తో సల్లూబాయ్ బిజీబిజీగా ఉంటున్నాడు.

నగరాల మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటి అంశాల వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది కనుక శివారు ప్రాంతాల్లో వీటి నిర్మాణం చేపట్టడం మంచిదంటూ సలహా ఇచ్చాడు. చాలా నగరాలలో చిన్న చిన్న ప్రాంతాలలో హాల్స్ లేవని తెలిపాడు. టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన థ్రిల్లర్ మూవీస్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'క్షణం'. ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుని సల్మాన్ ను ఇందులో హీరోగా తీసుకోవాలని ఓ నిర్మాత భావిస్తున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement