
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సుల్తాన్ : అఫీషియల్ ట్రైలర్
నిడివి : 3 ని. 18 సె.
హిట్స్ : 1,01,98,529
నాలుగు రోజుల క్రితమే సుల్తాన్ కొత్త ట్రైలర్ విడుదలైంది. పాత ట్రైలర్‌లో సల్మాన్ కుస్తీ ఒకటే కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌లో అనుష్క కుస్తీ స్పెషల్ ఎట్రాక్షన్. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న సుల్తాన్.. ఒక స్పోర్ట్స్ డ్రామా. కొంత రొమాన్స్ కూడా ఉంది. సల్మాన్‌ఖాన్, అనుష్క ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రం విడుదల జూలై 6. అర్తూర్ జురావ్‌స్కీ సినిమాటోగ్రఫీతో కనువిందు చేయనున్న సుల్తాన్ కథ ఒక వస్తాదు జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆ జీవితంలో గెలుపు ఓటములతో పాటు వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు ఉంటాయి. వాటి నుంచి ప్రేక్షకులు తేరుకోడానికి చక్కటి లవ్‌స్టోరీ సమాంతరంగా నడుస్తుంటుంది. ఇందులోని ప్రణయ సన్నివేశాలు ఇంతవరకు ఏ సినిమాలోనూ లేనివిధంగా భిన్నంగా, ఉద్వేగభ రితంగా ఉంటాయని నిర్మాత ఆదిత్య చోప్రా ప్రకటించారు.
స్టుపిడ్ హ్యూమన్ గమ్ ట్రిక్
నిడివి : 1.53
హిట్స్ : 18,94,063
డేవిడ్ లెటర్‌మ్యాన్ అమెరికన్ టెలివిజన్ వ్యాఖ్యాత. రేడియో హోస్ట్, కమెడియన్, రచయిత, నిర్మాత, నటుడు. ఆయన లేట్‌నైట్ షోలు, లేట్ షోలు ప్రపంచ ప్రసిద్ధి. ఇరవై ఏళ్ల క్రితం ‘50 గ్రేటెస్ట్ టీవీస్టార్ ఆఫ్ ఆల్‌టైమ్’లో లెటర్‌మ్యాన్ 45 ర్యాంకులో ఉన్నారు. ఇప్పుడాయన వయసు 69 ఏళ్లు. షోలు చాలా అరుదుగా మాత్రమే చేస్తున్నారు. లేటెస్టుగా ఓ అమ్మాయి తన చూయింగ్ గమ్ చాతుర్యంతో ఆయన్ని ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. ఆ వీడియో రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. స్టేజి మీద లెటర్‌మ్యాన్, ఆ అమ్మాయి ఉంటారు. ఆమె చూయింగ్ గమ్ నమిలి బయటి కి ఊస్తుంది. ఆలా ఊసి, వెంటనే దానిని నోట్లోకి తెప్పించుకుంటుంది! చూడ్డానికి ఎంతో వింతగా ఉన్న ఈ విద్యను ఆమె ఎలా అభ్యసించింది? ఈ ప్రశ్నకు ఆమె నవ్వే సమాధానం. వీడియో చూడండి. క్లోజప్‌లో చూడండి. ట్రిక్ తెలుస్తుందేమో ట్రై చెయ్యండి. ఆమె తల వెంట్రుకల్లోకి కంటికి కనిపించని దారం లాంటిదేదో ఎటాచ్ అయి ఉందని, దాంతో ఆమె ఆ చూయింగ్ గమ్‌ను మళ్లీ వెనక్కి లాగగలుగుతున్నారని ఓ లాజిక్.