Kisi Ka Bhai Kisi Ki Jaan: 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'.. ట్రైలర్ రిలీజ్ | Salman Khan Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Trailer Released Today | Sakshi
Sakshi News home page

Kisi Ka Bhai Kisi Ki Jaan: 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'.. ట్రైలర్ రిలీజ్

Published Mon, Apr 10 2023 7:06 PM | Last Updated on Tue, Apr 11 2023 5:19 PM

Salman Khan Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Trailer Released Today - Sakshi

బాలీవుడ్ భాయ్‌జాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'కిసీ కా భాయ్.. కిసీ కా జాన్'. ఈ మూవీతో సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను చిత్రబృందం రిలీజ్ చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 

కాగా.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ సైతం ఓ పాటలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, రాఘవ్ జుయల్, షెహనాజ్ గిల్, సిద్ధార్థ్ నిగమ్, పాలక్ తివారీ, జాస్సీ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement