
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా తెలుగు ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు. 3 నిమిషాల నివిడి ఉన్న ఈ ట్రైలర్ తమ అంచనాలకు తగినట్టుగా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గంభీరమైన స్వరంతో చిరంజీవి చెప్పిన డైలాగులు అభిమానులను ఉత్తేజితులను చేస్తున్నాయి. నరసింహారెడ్డి పాత్రలో చిరు ఒదిగిపోయారని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో తెలుగు ట్రైలర్‌ను 24 గంటల్లోపే 5 కోట్ల మందిపైగా వీక్షించారు. 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. హిందీలో సుమారు 50 లక్షలు, తమిళంలో దాదాపు 9 లక్షలు, కన్నడంలో 6.7 లక్షలు, మలయాళంలో లక్షకుపైగా వీక్షణలు నమోదయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’లో చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. కోణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై హీరో రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, రవికిషన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. (చదవండి: ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు)
Comments
Please login to add a commentAdd a comment