బీటౌన్‌లో 'బిగ్‌బాస్' సంద‌డి | Salman Khans Bigg Boss 14 To Premiere From October 3 | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ సీజ‌న్ 14.. అక్టోబ‌ర్ 3నుంచి ప్రారంభం

Sep 14 2020 3:03 PM | Updated on Sep 14 2020 4:00 PM

Salman Khans Bigg Boss 14 To Premiere From October 3 - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్ జ‌నాలు ఎప్ప‌టినుంచో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ డేట్ వ‌చ్చేసింది. సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా బిగ్‌బాస్ సీజ‌న్ 14 రెడీ అవుతోంది. వ‌చ్చేనెల 3వ తేదీ నుంచి షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను కలర్స్‌ ఛాన‌ల్ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో స‌ల్మాన్ మాస్క్‌తో క‌నిపించ‌డం విశేషం. త‌న రెండుచేతుల‌కు క‌ట్టిన గొలుసుల‌ను బ్రేక్ చేస్తూ స‌ల్మాన్ స‌త్తా చూపించాడు. ప్రోమో అదిరిపోయింది.. ఇక ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అంటూ ప‌లువురు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (రేఖ టూ రియా.. చరిత్ర పునరావృతమవుతోందా?)

అక్టోబ‌ర్ 3న తేదీ నుంచి ప్ర‌తీరోజు రాత్రి 10:30 గంట‌ల‌కు క‌ల‌ర్స్ ఛానెల్‌లో బిగ్‌బాస్ ప్ర‌సారం కానుండ‌గా, వీకెండ్స్‌లో మాత్రం 9 గంట‌ల‌కే ప్ర‌సారం కానుంది. ఇప్ప‌టికే షో కంటెస్టెంట్‌లుగా నటులు అధ్యాయన్ సుమన్, వివియన్ ద్సేనా, నియా శర్మలను షో యాజ‌మాన్యం సంప్ర‌దించిన‌ట్లు గ‌తంలోనూ ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. చిత్ర నిర్మాత ఒనిర్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉంది. కాంట్ర‌వ‌ర్స‌రీల‌తో గ‌త సీజ‌న్ టీఆర్సీ రేటింగ్స్‌లో దూసుకుపోయింది.  సీజ‌న్13 విజేత‌గా  సిద్దార్థ్ శుక్లా నిలిచిన సంగ‌తి తెలిసిందే. మ‌రి గ‌త సీజ‌న్‌తో పోలిస్తే కోవిడ్ నేప‌థ్యంలో ఈసారి షో ఎలా ఉండ‌బోతుంద‌న్న ఆస‌క్తి బీటౌన్‌లో నెల‌కొంది. (రాగిణి, సంజనల ఫోన్ల గుట్టు వీడింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement