సల్మాన్ని సవాల్ చేస్తున్న మేనల్లుడు | Ahil bonding with salman khan | Sakshi
Sakshi News home page

సల్మాన్ని సవాల్ చేస్తున్న మేనల్లుడు

Published Wed, Jul 6 2016 8:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

సల్మాన్ని సవాల్ చేస్తున్న మేనల్లుడు

సల్మాన్ని సవాల్ చేస్తున్న మేనల్లుడు

చాలా రోజులుగా సుల్తాన్ సినిమా భారీ షెడ్యూల్స్తో బిజీగా గడిపేసిన బాలీవుడ్ కండలవీరుడు ఇప్పుడు ఫ్యామిలీకి టైం ఇచ్చాడు. ముఖ్యంగా తన చెల్లెలు అర్పిత కొడుకు అహిల్తో కలిసి సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఈ మామ అల్లుళ్ల ఆటలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

తన తాజా చిత్రం సుల్తాన్ లో మల్లయోధుడిగా కనిపిస్తున్న సల్మాన్ తన మేనల్లుడితో బాక్సింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. చిన్నారి అహిల్ కూడా మామను సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుండటంతో అభిమానులు మామకు తగ్గ అల్లుడంటూ తెగ పొగిడేస్తున్నారు.

సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్గా నటించిన సుల్తాన్ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకోసం తీవ్రంగా శ్రమించిన సల్మాన్ తరువాత చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సల్మాన్, ఫ్యామిలీ కలిసి ఆనందంగా సమయం గడిపేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement