Ahil
-
హీరో నోటికి అందించినట్లే అందించి...
సాక్షి, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం టైగర్ జిందాహై షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చి... ఇప్పుడు లండన్ టూర్‌కు వెళ్లాడు. అంత కంటే ముఖ్యంగా అల్లుడు చిన్నారి అహిల్ను కూడా వెంట తీసుకెళ్లి ఎక్కువ సమయం గడుపుతూ బిజీగా గడిపేస్తున్నాడు. పుట్టినప్పటి నుంచే వీరిద్దరి మధ్య బంధాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ‘మాము’ సల్మాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా అహిల్ చేసిన మరో చిలిపి పనిని కూడా చూపించేశాడు. pic.twitter.com/8xBl143Mxz — Salman Khan (@BeingSalmanKhan) 15 September 2017 ఓ రెస్టారెంట్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో అహిల్ తన చేత్తో సల్మాన్ నోటికి ఏదో అందించినట్లే అందించి.. తన నోటిలో వేసుకున్నాడు. అంతే వెంటనే సల్మాన్ పగలబడి నవ్వాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. సల్మాన్‌కు గ్లోబల్ డైవర్సిటీ అవార్డు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో పురస్కారం లభించింది. పలు రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ అందించే గ్లోబల్ డైవర్సిటీ అవార్డును శుక్రవారం సల్మాన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బ్రిటీష్ పార్లమెంట్లో సుదీర్ఘకాలంగా ఏషియన్ ఎంపీగా కొనసాగుతున్న కెయితి వజ్ మాట్లాడుతూ.. సినీ రంగానికి సల్మాన్ చేసిన సేవలను కొనియాడారు. తనకి అవార్డు దక్కటంపై సల్మాన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ద-బంగ్ టూర్ పేరిట లండన్‌లో పర్యటిస్తున్న సల్మాన్ ఖాన్, బాలీవుడ్ నటుల బృందం బర్మింగ్హమ్లో ఆదివారం ప్రదర్శన ఇవ్వబోతున్నారు. -
సల్మాన్‌ని సవాల్ చేస్తున్న మేనల్లుడు
చాలా రోజులుగా సుల్తాన్ సినిమా భారీ షెడ్యూల్స్‌తో బిజీగా గడిపేసిన బాలీవుడ్ కండలవీరుడు ఇప్పుడు ఫ్యామిలీకి టైం ఇచ్చాడు. ముఖ్యంగా తన చెల్లెలు అర్పిత కొడుకు అహిల్‌తో కలిసి సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఈ మామ అల్లుళ్ల ఆటలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తన తాజా చిత్రం సుల్తాన్ లో మల్లయోధుడిగా కనిపిస్తున్న సల్మాన్ తన మేనల్లుడితో బాక్సింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. చిన్నారి అహిల్ కూడా మామను సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుండటంతో అభిమానులు మామకు తగ్గ అల్లుడంటూ తెగ పొగిడేస్తున్నారు. సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్గా నటించిన సుల్తాన్ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకోసం తీవ్రంగా శ్రమించిన సల్మాన్ తరువాత చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సల్మాన్, ఫ్యామిలీ కలిసి ఆనందంగా సమయం గడిపేస్తున్నాడు. Awwwdorable! Watch baby Ahil bonding with his Mamu #SalmanKhan and learning #Sultan moves! pic.twitter.com/9V6GSnTbuI — Salman Khan Fan Club (@BSKFanClub) 4 July 2016 -
అమ్మమ్మ, మనవడు..ఓ ఫోటో
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన నిజజీవితంలో వచ్చిన సరికొత్త ప్రమోషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన ముద్దుల మేనల్లుడు ఆహిల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటున్నాడు. చిన్నారి ఆహిల్ రాకను ఘనంగా ఆహ్వానించిన బాలీవుడ్ కండల వీరుడు తాజాగా క్యూట్ ఫోటో నొకదాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'అమ్మమ్మ సల్మా, మనవడు ఆహిల్ ' అంటూ ఒక ముచ్చటైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమ్మ సల్మా ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న మేనల్లుడు ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు సల్మాన్. కాగా సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ, అయూష్ శర్మ దంపతులకు ఈ మార్చి 30న ఆహిల్ పుట్టాడు. ఈ నేపథ్యంలో మేనల్లుడి రాకతో మురిసిపోతున్న సల్మాన్ తన బుజ్జి మేనల్లుడు అహిల్కు ఇటీవల ఒక ఖరీదైన కారును కూడా బహుమతిగా ఇచ్చాడు. -
మేనల్లుడితో మురిపెంగా..!
సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే తన సోదరీ, సోదరుల బిడ్డలను బాగా చూసుకుంటారు. తాజాగా ఈయనగారి ముద్దుల చెల్లి అర్పితా ఖాన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బుడతడికి అహిల్ అని పేరు పెట్టారు. మేనల్లుణ్ణి ఎత్తుకుని, సల్మాన్ ఇలా మురిసిపోయారు.