హీరో నోటికి అందించినట్లే అందించి...
హీరో నోటికి అందించినట్లే అందించి...
Published Sat, Sep 16 2017 11:36 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM
సాక్షి, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం టైగర్ జిందాహై షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చి... ఇప్పుడు లండన్ టూర్‌కు వెళ్లాడు. అంత కంటే ముఖ్యంగా అల్లుడు చిన్నారి అహిల్ను కూడా వెంట తీసుకెళ్లి ఎక్కువ సమయం గడుపుతూ బిజీగా గడిపేస్తున్నాడు.
పుట్టినప్పటి నుంచే వీరిద్దరి మధ్య బంధాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ‘మాము’ సల్మాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా అహిల్ చేసిన మరో చిలిపి పనిని కూడా చూపించేశాడు.
ఓ రెస్టారెంట్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో అహిల్ తన చేత్తో సల్మాన్ నోటికి ఏదో అందించినట్లే అందించి.. తన నోటిలో వేసుకున్నాడు. అంతే వెంటనే సల్మాన్ పగలబడి నవ్వాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.
సల్మాన్‌కు గ్లోబల్ డైవర్సిటీ అవార్డు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో పురస్కారం లభించింది. పలు రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ అందించే గ్లోబల్ డైవర్సిటీ అవార్డును శుక్రవారం సల్మాన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బ్రిటీష్ పార్లమెంట్లో సుదీర్ఘకాలంగా ఏషియన్ ఎంపీగా కొనసాగుతున్న కెయితి వజ్ మాట్లాడుతూ.. సినీ రంగానికి సల్మాన్ చేసిన సేవలను కొనియాడారు. తనకి అవార్డు దక్కటంపై సల్మాన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ద-బంగ్ టూర్ పేరిట లండన్‌లో పర్యటిస్తున్న సల్మాన్ ఖాన్, బాలీవుడ్ నటుల బృందం బర్మింగ్హమ్లో ఆదివారం ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
Advertisement
Advertisement