బాక్సాఫీస్ బరిలో 'సుల్తాన్' హవా | Salman Khans Sultan box office collections on day 3 massive | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్ బరిలో 'సుల్తాన్' హవా

Published Sat, Jul 9 2016 3:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

బాక్సాఫీస్ బరిలో 'సుల్తాన్' హవా

బాక్సాఫీస్ బరిలో 'సుల్తాన్' హవా

సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరికెక్కిన సినిమా సుల్తాన్. సల్మాన్ మల్లయోధుడిగా కనిపించిన ఈ సినిమా మరోసారి సల్మాన్ స్టామినాను ప్రూవ్ చేస్తూ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. కండల వీరుడు ఈ సినిమాతో మరోసారి ఈద్ బరిలో తనకు తిరగులేదని నిరూపించుకున్నాడు.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్లో సరికొత్త రికార్డ్లు సృష్టిస్తున్న సుల్తాన్, సల్మాన్ కెరీర్లోనే నెంబర్ వన్గా నిలిచింది. తొలి మూడు రోజుల్లోనే 105 కోట్లకు పైగా వసూళ్లు చేసిన సుల్తాన్, ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి 150 కోట్ల మార్క్ను రీచ్ అవుతుందని భావిస్తున్నారు. లాంగ్ వీకెండ్తో పాటు మరో స్టార్ హీరో బరిలో లేకపోవటం కూడా సల్మాన్కు కలిసొచ్చింది.

సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందించారు. తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్ సీస్లో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement