ఆరు వారాలు... అద్భుతమైన ట్రైనింగ్! | Anushka Sharma grateful for wrestling trainers | Sakshi
Sakshi News home page

ఆరు వారాలు... అద్భుతమైన ట్రైనింగ్!

Published Fri, Mar 11 2016 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

ఆరు వారాలు... అద్భుతమైన ట్రైనింగ్!

ఆరు వారాలు... అద్భుతమైన ట్రైనింగ్!

‘‘పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. నటిగా నేను సిగ్గుపడకూడదు. అందుకే సవాల్ అనిపించే పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు’’ అని అనుష్కా శర్మ అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఓ శక్తిమంతమైన పాత్రకు పచ్చజెండా ఊపేశారు. అది అలాంటి, ఇలాంటి పాత్ర కాదు. మల్లయుద్ధం చేయడానికి వెనకాడని పాత్ర. ‘సుల్తాన్’ చిత్రం కోసమే అనుష్కా శర్మ ఈ యుద్ధం చేయనున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మల్లయుద్ధం నేపథ్యంలో సాగుతుంది.

ఈ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ కొన్ని నెలల పాటు మల్లయుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్నారు. అనుష్కా శర్మ కూడా సినిమాలో మల్లయుద్ధం చేస్తారు కాబట్టి, శిక్షణ తీసుకున్నారు. ఆరు వారాల పాటు పలువురు ట్రైనర్ల ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరిగింది. ‘‘మల్లయుద్ధం నేర్పించిన నా గురువులందరికీ ధన్యవాదాలు. గొప్ప గురువులు దొరకడం నా అదృష్టం’’ అంటూ తనకు రెజ్లింగ్ నేర్పించిన టీచర్స్‌తో కలిసి ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు అనుష్కా శర్మ. ఈ బ్యూటీ  శిక్షణ తీసుకుంటున్న సమయంలో చూసినవాళ్లు, భేష్ అంటున్నారు. కఠినంగా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా నేర్చుకున్నారట. మరి.. అనుష్కా? మజాకానా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement