రెజ్లింగ్ ట్రైనింగ్ లో టాప్ హీరోయిన్ | Anushka sharma took wrestling training for Sultan movie | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్ ట్రైనింగ్ లో టాప్ హీరోయిన్

Published Fri, Mar 11 2016 7:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రెజ్లింగ్ ట్రైనింగ్ లో టాప్ హీరోయిన్ - Sakshi

రెజ్లింగ్ ట్రైనింగ్ లో టాప్ హీరోయిన్

ముంబై: కండలవీరుడు సల్మాన్ ఖాన్, మిల్కీ గర్ల్ అనుష్క శర్మ తొలిసారి జతకట్టిన మూవీ 'సుల్తాన్'. ఎంతో హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత ఆఖరికి సల్మాన్ పక్కన కథానాయికగా ముద్దుగుమ్మ అనుష్క ఎంపికైంది.  అయితే ఈ మూవీలో హీరో,హీరోయిన్ రెజ్లర్లుగా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఆరు వారాల పాటు రెజ్లింగ్ గురించి కోచింగ్ తీసుకోనుంది. హాయిగా ఏసీ రూముల్లో ఉండే ఈ భామ సినిమా కష్టాలు నిజంగానే అనుభవించనుంది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న 'సుల్తాన్' మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో తనపాత్రకు మరింత న్యాయం చేయాలని ఈ భామ తపిస్తున్నందుకు దర్శకుడు చాలా ఇంప్రెస్ అయిపోయారట.

నిజమైన రెజ్లర్ గా కనిపించేందుకు శరీరాన్ని అందుకు అనుగుణంగా మలుచుకుంటున్నందుకు ఆశ్చర్యానికి లోనైనట్లు జాఫర్ వివరించారు. ప్రేమికులరోజు సందర్భంగా సల్మాన్, అనుష్కలు జంటగా ఉన్న సుల్తాన్ 'ఫస్ట్ లుక్'ను యూనిట్ విడుదల చేసింది. ప్రజల చేత 'హర్యానా కా షేర్' అనిపించుకునే సుల్తాన్.. 'హర్యానా కీ షాన్'గా గుర్తింపు ఉన్న ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరు ప్రొఫెషనల్ క్రీడాకారుల మధ్య జరిగే ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందంటూ ఎదురుచూస్తున్నారు. జూన్ 8న ఈ మూవీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. గతంలో ప్రియాంక చోప్రా 'మేరీకోమ్' మూవీ కోసం ఎంతగానో శ్రమించింది, గాయాలపాలైంది. ఆ మూవీ సక్సెస్ అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement